awft అనేది దేవదాయ ధర్మదాయశాఖ ఆలయాల్లో పనిచేసే పండితులు, అర్చకులు, ఆలయాల్లో పనిచేసే ఇతర ఉద్యోగుల కోసం ప్రభుత్వం ఈ పథకాల్ని తీసుకువచ్చింది
ఆంధ్రప్రదేశ్, దేవదాయ ధర్మదాయశాఖ దేవాలయాల్లో మరియు ధార్మిక సంస్థలలో వార్షికాదాయం రు.50 లక్షల లోపు ఉన్న దేవాలయాలలో పనిచేస్తూ, నెలకు రు.12,500/- అంతకు లోపు వేతనం లభించు అర్చకులు, మరియు సిబ్బంది, వారి కుటుంబసభ్యుల సంక్షేమం మరియు వారి జీవన ప్రమాణాల మెరుగుకై “AWFT (ఆర్చక మరియు ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధి)” ఏర్పాటు చేయబడినది
1. ఉపనయనం
అర్చకుడు / ఉద్యోగి తమ పిల్లలకు చేసే ఉప నయనానికి గాను ఉదారంగా (గ్రాంటు) రు.25,000/- ఇస్తారు. 7 రోజుల ముందు దరఖాస్తు సమర్పించాలి.
సమర్పించాల్సిన పత్రములు :
- ఉపనయనం శుభలేఖ
- BANK అకౌంట్ వివరములు
2. విద్యా గ్రాంటు
అర్చకుడు / ఉద్యోగి పిల్లలకు ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాల యందు డిగ్రీ స్థాయి(B.E/B.Tech,Medicine,CA,B.L,D.E.D/B.E.D) వృతి విద్యా కోర్సులను . చదువుతుంటే, వారికి College fee minimum రు.33,000/- ఉదారంగా (గ్రాంటు) అందించటం జరుగుతుంది.
సమర్పించాల్సిన పత్రములు :
- SSC Certificate Xerox
- Intermediate Certificate Xerox
- Entrance Rank Card
- Admission ఫీజు రశీదు
- Study Certificate
- Bank Account Xerox
3.వివాహ ఋణం
తమ పిల్లలు లేదా చెల్లి లేదా అక్కకి వివాహం చేయు సందర్భంలో 2% వార్షిక వడ్డీకి రు.1,00,000/- ఋణ సహాయం అందించబడును. 7 రోజుల ముందు దరఖాస్తు సమర్పించాలి.
సమర్పించాల్సిన పత్రములు :
- వివాహ నిశ్చయ శుభలేఖ
- Bank Account Xerox
4. గృహ నిర్మాణం
4. (i) గృహ నిర్మాణం కొరకు ఆర్ధిక సహాయం
స్వంత గృహంలేని అర్చకులు మరియు సిబ్బందికి అర్చక మరియు ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధి(awft) 4% వడ్దీపై రు.5,00,000/- ఆర్ధిక సహాయం అందిస్తుంది .
ఇట్టి మొత్తంలో 50% అనగా రు.2,50,000/- గ్రాంటు గాను మిగిలిన రు.2,50,000/- ఋణం గాను అందించటం జరుగుతుంది. ఈ మొత్తం రెండు దఫాలుగా చెల్లించబడుతుంది. అయితే ఈ సదుపాయం అభ్యర్ధికి Serviceలో ఒకేసారి మాత్రమే అందించబడుతుంది.
మొదటి విడత సమర్పించాల్సిన పత్రములు :
- స్థల నివేశన పత్రం / Sale Deed Xerox / ఇంటిపన్ను రశీదు
- పంచాయతీ / మున్సిపాలిటీ ఆమోదం పొందిన Plan
- నిర్మాణ వ్యయ అంచనా పత్రం (Estimation Slip)
- గృహం నిర్మించ తలపెట్టిన స్థలం యొక్క ఫోటోలు
- ఇద్దరి వ్యక్తుల పూచీకత్తులు (Surety)
- Bank Account Xerox
రెండవ విడత సమర్పించాల్సిన పత్రములు :
- డిప్యూటీ ఇంజినీరు / A.E(దేవాదాయ శాఖ), సహాయ కమీషనరు వారు జారీ చేసిన గృహనిర్మాణ ప్రగతి ధృవీకరణ.
- మొదటి విడత ద్వారా మంజూరు చేయబడ్డ మొత్తానికి చేసిన ఖర్చులకు సంబంధించిన బిల్లులు (Bills)
- నిర్మాణం చేసిన గృహం యొక్క ఫోటో
- Bank Account Details
(ii) గృహ మరమ్మతులు
అర్చక / సిబ్బందికి ప్రస్తుతం ఉన్న గృహమునకు మరమ్మతులు చేయుటకు గాను రు.2,00,000/- లు ఆర్ధిక సహాయం అందించబడుతుంది. ఇట్టి మొత్తంలో 50% Grant గాను, మిగిలిన 50% Loan గాను అందించటం జరుగుతుంది. ఈ మొతం రెండు విడతలుగా చెల్లించబడుతుంది. గ్రాంటు : రు.1,00,000/-
మొదటి విడత సమర్పించాల్సిన పత్రములు :
- Sale Deed జిరాక్స్, ఇంటిపన్ను రశీదు పత్రం (House Tax)
- ఇంజినీరు వారిచే ఆమోదించబడిన మరమ్మతుల అంచనా వ్యయ పత్రం(Estimation Slip)
- గృహ నిర్మాణ నమూనా
- ఇద్దరి వ్యక్తుల ద్వారా పూచీకత్తులు
- Bank Account Details
ఋణం : రు.1,00,000/-
రెండవ విడత సమర్పించాల్సిన పత్రములు :
- డిప్యూటీ ఇంజినీరు / A.E(దేవాదాయ శాఖ), సహాయ కమీషనరు వారు ధృవీకరించిన గృహమరమ్మతులు ప్రగతి పత్రం
- మొదటి విడత మొత్తమునకు చేసిన ఖర్చుకు సంబంధించిన బిల్లులు మరియు వివరాలు
- గృహ నిర్మాణ ప్రగతి ఫోటో
- Bank Account Details
5.వైద్య ఖర్చులు
5. (i) వైద్య ఖర్చులు తిరిగి చెల్లింపు
అర్చకుడు / దేవాలయ ఉద్యోగి / కుటుంబ సభ్యులు అనారోగ్యంతో ఆసుపత్రి నందు చికిత్స పొందిన సందర్భాలలో చేసిన వైద్య ఖర్చులను గరిష్టంగా రు.2,00,000/- వరకు తిరిగి చెల్లింపు చేయబడును.
సమర్పించాల్సిన పత్రములు :
- Annexure 2
- Emergency certificate
- Essentiality certificate
- Consolidated Bill Statement
- హాస్పిటల్ వారు జారీచేసిన డిశ్చార్జి సమ్మరీ మరియు ఆరోగ్యశ్రీ లేదా వీరే ఇతర భీమా సంస్థల నుండి తిరిగి చెల్లింపులు చేసియుండలేదని హాస్పిటల్ వారు జారీచేసిన నాన్ డ్రాయల్ సర్టిఫికెట్
- Bank Account Details
అర్చకుడు / దేవాలయ ఉద్యోగి మరియు వారి కుటుంబ సభ్యులెవరైనా అత్యవసర సమయాల్లో దురదృష్టవశాత్తు ఆసుపత్రి పాలైన సందర్భాలలో వారి అవసరాన్ని బట్టి వైద్యం చేయుటకు వీలుగా ఆర్చక సంక్షేమనిధి(awft) ముందస్తు హామీ పత్రమును (L.O.C ) ఆసుపత్రి వారికి జారీచేసి వైద్యం చేయుటకు సహాయమందిస్తుంది.
సమర్పించాల్సిన పత్రములు :
- Emergency certificate
- వైద్యమునకు అయ్యే అంచనా వ్యాయపత్రము
- Bank Account Details
(ii) ప్రమాదవశాత్తు అంగవైకల్యం పొందిన వారికి ఆర్ధిక సహాయం
10 సంవత్సరాలు పనిచేసి ప్రమాదవశాత్తు అంగవైకల్యం పొంది, తదుపరి పనిచేయలేని స్థితిలో ఉన్న వారికి రు.2,00,000/- ఆర్ధిక సహాయంగా అందించబడుతుంది.
సమర్పించాల్సిన పత్రములు :
- F.I.R
- వైద్యధికారివారి జారీచేసిన అంగవైకల్య ధృవీకరణ పత్రం.
- Bank Account Details
6.పదవీ విరమణ గ్రాట్యుటి
సుదీర్ఘ కాలంపాటు దేవాదాయశాఖ సంస్థల యందు పనిచేసే సిబ్బంది / అర్చకులకు వారి పదవీ విరామనానంతర జీవనం సాఫీగా సాగుటకుగాను గరిష్టంగా రు.4,00,000/- వరకు గ్రాట్యుటి రూపేణా ఆర్ధిక సహాయం అందించబడుతుంది. ఇందులో 50% మొత్తం 10 Years లో కాలపరిమితిFixed Deposit చేసి, మిగిలిన 50% మొత్తం లబ్ధిదారునకు Cash రూపేణా వెంటనే ఇస్తారు.
7.కారుణ్య ధనసహాయం
ప్రమాదవశాత్తు మరణిస్తే:
అర్చకుడు / దేవాలయ సిబ్బంది ప్రమాదవశాత్తు మరణిస్తే రు.1,00,000/- మరియు దహన సంస్కారములకు రు.15,000/- అందించబడుతుంది. ఇట్టి సొమ్మును ex gratia రూపంలో దివంగత అర్చక / సిబ్బంది వారసునకు చెల్లించబడుతుంది. దీనితో పాటు Gratuity గరిష్టంగా రు.4,00,000/- పైన తెలిపిన విధంగా అందించబడుతుంది.
సమర్పించాల్సిన పత్రములు :
- F.I.R
- మరణ ధృవీకరణ పత్రము
- శవపంచనామా నివేదిక
- గ్రాట్యుటి ధరఖాస్తు
- సర్వీసు ధృవీకరణ పత్రం
- Bank Account Details
సహజమరణం సంభవిస్తే:
అర్చకుడు / దేవాలయ సిబ్బంది సహజమరణం సంభవిస్తే రు.50,000/- మరియు దహన సంస్కారముల నిమిత్తము రు.10,000/- లతో పాటు, గరిష్టంగా రు.4,00,000/- గ్రాట్యుటి దివంగత అర్చక / ఉద్యోగి వారసునకు అందించబడుతుంది.
సమర్పించాల్సిన పత్రములు :
- మరణ ధృవీకరణ పత్రము (Death Certificate )
- లీగల్ హెయిర్ సర్టిఫికేట్
- సర్వీసు ధృవీకరణ పత్రం
- గ్రాట్యుటి ధరఖాస్తు
- Bank Account Details