YSR Cheyutha Scheme New Application Status 2024

YSR Cheyutha (చేయూత) పథకం ఒక రాష్ట్ర ప్రభుత్వ పథకం, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల అన్ని మహిళలకు ఆర్థిక సహాయం అందించడానికి రూపొందించబడింది. ఈ పథకం కింద, ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రతి మహిళకు రూ.18,750 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.

మీరు 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళ అయితే, మీరు వైఎస్సార్ చేయూత పథకం కింద ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Cheyutha Release Date 2024

  • 𝐘𝐒𝐑 𝐂𝐡𝐞𝐲𝐮𝐭𝐡𝐚 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 : ఫిబ్రవరి 26న విడుదల చేయాల్సి ఉన్న వైయస్సార్ చేయూత మరోసారి వాయిదా పడింది. కొత్త డేట్ త్వరలో ప్రకటించనున్న ప్రభుత్వం

YSR Cheyutha 2024 Latest Updates

2023-24 సంవత్సరం సంబంధించి అమౌంట్ సెప్టెంబర్ లో విడుదల కానుంది. కొత్త అప్లికేషన్ దరఖాస్తులు స్వీకరణ ప్రారంభం అయ్యాయి. త్వరలో గత ఏడాది అనర్హుల లబ్ధిదారుల వెరిఫికేషన్‌ కూడా ప్రారంభం కానుంది. అర్హులైన వారు APSEVA ద్వారా ఆదాయం, కుల ధృవీకరణ పత్రాలు సిద్దంగా ఉంచుకోండి

వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) అర్హతలు

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు అయ్యి ఉండాలి
  • SC, ST, BC, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకి వయస్సు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి
  • ఆధార్ కార్డు ఉండాలి
  • రైస్ కార్డు / తెల్ల రేషన్ కార్డు ఉండాలి
  • బ్యాంకు ఖాతా ఉండాలి
  • మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతంలో అయితే పదివేల రూపాయలు మరియు పట్టణ ప్రాంతంలో అయితే 12 వేల రూపాయలకు మించరాదు
  • మొత్తం కుటుంబానికి మూడెకరాల మాగాణి లేదా పది ఎకరాల మెట్ట లేదా మాగాణి మెట్ట రెండు కలిపి పది ఎకరాలకు మించరాదు
  • కుటుంబంలో ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం గానీ ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకోవడం కానీ ఉండకూడదు
  • కుటుంబం నివసిస్తున్న ఇంటి యొక్క కరెంట్ వినియోగ బిల్ అనేది సరాసరి 300 యూనిట్లకు లోబడి ఉండాలి
  • పట్టణ ప్రాంతంలో సొంత ఇంటి కోసం స్థలం ఉన్నట్లయితే అది 750 చదరపు గజాలకు మించి ఉండరాదు అంటే 750 చదరపు గజాలకు లోబడి ఉండాలి
  • కుటుంబంలో ఏ ఒక్కరు కూడా ఆదాయ పన్ను చెల్లించే స్థాయి లో ఉండకూడదు
  • కుటుంబంలో ఎవరు ఫోర్ వీలర్ వెహికల్ కలిగి ఉండకూడదు

వైఎస్ఆర్ చేయూత పథకం దరఖాస్తు చెయ్యడం ఎలా (How To Apply For YSR Cheyutha Scheme)

వైఎస్ఆర్ చేయూత పథకం కోసం దరఖాస్తు చేయడానికి, మీరు మీ సమీప గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయాన్ని సందర్శించాలి. మీరు దరఖాస్తు ఫారమ్‌ను పొందవచ్చు మరియు అవసరమైన పత్రాలను సమర్పించవచ్చు. అర్హులైన అభ్యర్థుల జాబితా సచివాలయం నోటీసు బోర్డ్‌లో ప్రచురించబడుతుంది. అర్హులైన అభ్యర్థులకు ప్రతి సంవత్సరం రెండు విడతలుగా రూ.18,750 మంజూరు చేయబడుతుంది. మీరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయలేరు.

వైఎస్ఆర్ చేయూత పథకానికి జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకునే విధానం

  • అర్హత కలిగిన వారు రైస్  కార్డు మరియు ఆధార్ కార్డు వివరాలతో గ్రామ సచివాలయ వాలంటీర్ను కలిసి దరఖాస్తు ఇవ్వవచ్చు 
  • వారి యొక్క Eligibility Criteria ను ఆన్ లైన్ లొ చెక్ చేసి అర్హులా ? కారా? అని చెక్ చేసి అర్హులు అయితే సంబంధిత డాక్యుమెంట్లతో దరఖాస్తు చేయడం జరుగుతుంది. అర్హులు కాకపోతే ఎందుకు అర్హులు కారో వారికి తెలియజేయడం జరుగుతుంది.
  • దరఖాస్తుదారునికి (యువర్ సర్వీస్ రిక్వెస్ట్ –  మీ సేవల అభ్యర్థన)  నెంబర్ ఇవ్వబడుతుంది దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి వారి దరఖాస్తులను సరిచూసి 18,750/-  రూపాయలు మంజూరు చేసి వారి  బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది

YSR Cheyutha Scheme Required Documents

  1. Application Form 
  2. ఆధార్ అప్డేట్ హిస్టరీ 
  3. Caste Certificate (AP Seva)
  4. Income Certificate (AP Seva)
  5. Bank Passbook
  6. Bio eKYC / IRIS eKYC / OTP Authentication 
  7. Rice Card 

వైఎస్ఆర్ చేయూత పథకం లాభాలు (YSR Cheyutha Scheme Benefits)

వైఎస్ఆర్ చేయూత పథకం కింద అర్హత కలిగిన మహిళలు తమ స్వంత చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా ఇతర ఆర్థిక కార్యకలాపాలను చేపట్టడానికి సహాయం అందుతుంది. ఈ పథకం కింద అర్హత కలిగిన మహిళలు కిరాణా షాపులు, గేదెలు, ఆవులు, మేకల యూనిట్లు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందిస్తుంది.

YSR Cheyutha Scheme Payment Date 2024

వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) చెల్లింపు షెడ్యూల్ (YSR Cheyutha Scheme Payment Schedule) వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా  18,750 రూపాయలు పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది వైఎస్ఆర్ చేయూత పథకం పేమెంట్ డేట్ సెప్టెంబర్  23,2023. ఉత్తర్వుల మేరకు మారవచ్చ్చు 

YSR Cheyutha Application Status

వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) పేమెంట్  స్టేటస్ ను పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్ను చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ స్టేటస్ మరియు పేమెంట్ స్టేటస్ ను తెలుసుకోవటం కోసం కింద లింక్ పై క్లిక్ చెయ్యండి 

YSR Cheyutha Sanction List

వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) పేమెంటు ను  ప్రభుత్వం విడుదల చేసిన మరుసటి రోజు నుంచి వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది  . వైఎస్ఆర్ చేయూత పథకం మంజూరు జాబితాను అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయి చూసుకోవచ్చు లేదా గ్రామ వాలంటీర్ను కలిసి మంజూరు జాబితాలో మీ పేరు ఉన్నదా లేదా అని తెలుసుకోవచ్చు.

welfare calender

Leave a Comment