postal ballot : ఎన్నికల విధులలో పాల్గొనే ఓటర్లు తమ ఓటు ఉన్న నియోజక వర్గం కాకుండా ఇతర నియోజక వర్గంలో విధులు నిర్వహించే సంధర్భంలో పోస్టల్ బ్యాలెట్ పొందవచ్చు.
పోస్టల్ బ్యాలెట్ మీ యొక్క ఓటు ఉన్న సంబంధిత రిటర్నింగ్ అధికారి ద్వారా జారీ చేయబడును. దీనిని మీరు ఎన్నికల విధులు నిర్వహించు నియోజక వర్గం లో పొందుతారు.
Postal Ballot ద్వారా ఓటు వేయడానికి
పోస్టల్ బ్యాలెట్ “ఫెసిలిటేషన్ సెంటర్” నందు మాత్రమే మీకు అందజేయబడును. మీ పోస్టల్ బ్యాలెట్ తీసుకుని వెంటనే అక్కడే “ఫెసిలిటేషన్ సెంటర్” లో ఏర్పాటు చేయబడిన కంపార్ట్మెంట్ లో ఓటు వేయాల్సి ఉంటుంది (మీరు ఏ నియోజక వర్గం ఓటరైనను).
పోస్టల్ బ్యాలెట్‌లో ఫారమ్‌లు మరియు కవర్‌లు
ఫారం 13 A : డిక్లరేషన్ ఫారం. ఇది పింక్ కలర్ లో ఉన్న ఇన్నర్ కవర్ 1 లో ఉంటుంది.
ఫారం 13 B (కవర్ A) దీనినే ఇన్నర్ కవర్ 2 అంటారు. ( బ్లూ కలర్, ఇందులోనే బ్యాలెట్ పత్రం ఉంటుంది)
ఫారం 13 C (కవర్ B) దీనినే అవుటర్ కవర్ అంటారు. ( ఎల్లో కలర్, పెద్ద కవర్)
ఫారం 13 D : ఓటరు కు సూచనలు.
పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయు పద్ధతి
1. ఫెసిలిటేషన్ సెంటర్‌లో ధృవీకరణ
మీరు ధృవీకరణ పత్రాలతో ఫెసిలిటేషన్ సెంటర్‌కు చేరుకోండి.
పోస్టల్ బ్యాలెట్ ఇంఛార్జ్ అధికారి మీ ధృవీకరణ పత్రాలను తనిఖీ చేసి, మీకు పోస్టల్ బ్యాలెట్‌ను అందిస్తారు.
2. కంపార్ట్మెంట్‌లో ఓటు వేయడం
పోస్టల్ బ్యాలెట్‌తో కంపార్ట్మెంట్‌లోకి వెళ్లండి.
ఫారం 13B (బ్లూ కలర్) కవర్‌లోని బ్యాలెట్ పత్రాన్ని బయటకు తీయండి.
బ్యాలెట్ పత్రంపై ఉన్న సీరియల్ నంబర్‌ను ఫారం 13A (పింక్ కలర్) డిక్లరేషన్ ఫారంపై మరియు ఫారం 13B (బ్లూ కలర్) కవర్‌పై వ్రాయండి.
బ్యాలెట్ పత్రంలో మీకు నచ్చిన అభ్యర్థికి X లేదా టిక్ మార్క్ చేయండి.