how to apply new voter id card online 2024

18 సంవత్సరాల వయస్సు కలిగిన ప్రతి ఒక్కరు వోటు వెయ్యడానికి అర్హులుగా భారత రాజ్యాంగం నిర్ణయించింది.అందువల్ల 18 సంవత్సరాల వయస్సు కలిగిన ప్రతి ఒక్కరు ఓటరు లిస్టు లో పేరు నమోదు చేసుకొని ఓటర్ ఐడి కార్డు ను పొందాలి 

కొత్త గా ఓటర్ ఐడి కార్డు (Voter Id Card) కావాలి అనుకునే వారు ఎలా ధరఖాస్తు చేసుకోవాలో తెలుసుకోండి 

New Voter id Card Application Process

Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన అధికారిక వెబ్సైట్ లింక్ పై క్లిక్ చేయండి.

మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటె Login పై క్లిక్ చేసి STEP 7 నుంచి మొదలుపెట్టండి

Step 2 :మీకు ముందుగా NVSP సైట్ లొ లేదా ECI సైట్ లొ అకౌంట్ ఉంటే Login పై లేదంటే Sign-Up పై క్లిక్ చేయండి. అకౌంట్ ఉందొ లేదో తెలియక పోయినా Sign-Up పై క్లిక్ చేయండి.

Step 3 :మీ Mobile Number బాక్స్ లొ మీ మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయాలి.ఏ నెంబర్ అయినా పర్వాలేదు లేదు. Captcha కోడ్ ఎంటర్ చేసి  Continue   పై క్లిక్ చేయండి.

Step 4 :First Name,Last Name లొ మీ పేరు ను, Password, Confirme Password లొ కొత్త పాస్వర్డ్ ను ఎంటర్ చేయండి. Password లొ 1,2,3.. A, B, C.. a, b, c.. @, #, ₹… ఇలా అన్నిటీలో ఒకటి ఉండేలా ఎంటర్ చేయండి. మీకు తరువాత గుర్తు వుండదు అనిపిస్తే Note చేసుకోండి. Request OTP పై క్లిక్ చేయండి.

Step 5 :మీరు ముందు ఇచ్చిన మొబైల్ నెంబర్ కు 6 అంకెల OTP వస్తుంది. ఆ నెంబర్ ఎంటర్ చేయండి. Verify & Submit పై క్లిక్ చేయండి.

Step 6 :You Are Successfully Signed Up Kindly Login With Your New Credentials” అని చూపిస్తుంది. అంటే మీకు ECI సైట్ లొ మీకు అకౌంట్ క్రియేట్ అయ్యింది అని అర్థము. Login పై క్లిక్ చేయండి.

Step 7 :Registratered Mobile No వద్ద మీ మొబైల్ నెంబర్, Password వద్ద ముందు పెట్టిన పాస్వర్డ్ ఎంటర్ Captcha ఎంటర్ చేసి Request OTP పై క్లిక్ చేయండి.

Step 8 :మీరు ముందు ఇచ్చిన మొబైల్ నెంబర్ కు 6 అంకెల OTP వస్తుంది. ఆ నెంబర్ ఎంటర్ చేయండి. Verify & Login పై క్లిక్ చేయండి.

  1. Step 9 :కొత్తగా Voter Cardకు దరఖాస్తు చేయుటకు Home పేజీ లొ Fill Form 6 పై క్లిక్ చేయండి. 
మొత్తం 12 సెక్షన్ లలో డేటా ఫిల్ చేయాలి. అవి.
  1. Select State, District & AC
  2. Personal Details
  3. Relatives Details
  4. Contact Details
  5. Aadhaar Details
  6. Gender
  7. Date of Birth details
  8. Present Address Details
  9. Disability Details
  10. Family member Details
  11. Declaration
  12. Captcha

పై డేటా అంత ఫిల్ చేసాక ఫైనల్ సబ్మిట్ చేయాలి.

Step 10 :అందులో మొదటిది State, District & Assembly Constituency / Parliamentary Constituency సెక్షన్ లొ

  • రాష్ట్రములో
  • జిల్లా
  • నియోజకవర్గం

వివరాలు ఇవ్వాలి. Next పై క్లిక్ చేయాలి.

Step 11 :Personal Details లొ

  • మొదటి పేరు
  • ఇంటి పేరు
  • పాసుపోర్టు సైజు ఫోటో

అప్లోడ్ చేయాలి. ఫోటో JPG / JPEG ఫార్మాట్ లొ 2MB కు మించి ఉండరాదు. తరువాత Next పై క్లిక్ చేయాలి

Step 12 :Relatives Details లొ

తండ్రి / తల్లి / భర్త / భార్య / సంరక్షకుల / హిజ్రాల కు సంబందించి

  • పేరు
  • ఇంటి పేరు

వివరాలు ఎంటర్ చేసి, Next పై క్లిక్ చేయాలి

Step 13 :Contact Details లొ

సొంత లేదా పైన తెలిపిన వారి మొబైల్ నెంబర్ ఎంటర్ Send OTP ద్వారా OTO Send చేసి OTP ను ఎంటర్ చేసి Verify చేయాలి.

మొబైల్ నెంబర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఏ మొబైల్ నెంబర్ అయితే ఇస్తున్నారో అదే మొబైల్ నెంబర్ భవిష్యత్తులో Voter Card డౌన్లోడ్ చేసుకోవడానికి ఇతర ఇతర విషయాలకు ఉపయోగపడుతుంది.

E-mail ID వివరాలు ఉంటే ఎంటర్ చేయాలి. లేదంటే అవసరం లేదు. తరువాత Next పై క్లిక్ చేయాలి

Step 14 :Aadhaar Details లొ

  • ఆధార్ నెంబర్

ను ఎంటర్ చేసి Next పై క్లిక్ చేయాలి.

Step 15 : Gender లొ లింగము ను

  • Male
  • Female
  • Third Gender

లొ ఒకటి సెలెక్ట్ చేసి Next పై క్లిక్ చేయాలి.

Step 16 :Date of Birth details లొ

  • Date Of Birth (DD/MM/YYYY)

ను ఎంటర్ చేసి సర్టిఫికెట్ ను 2MB లోపు JPG/JPEG/PDF ఫార్మాట్ లొ అప్లోడ్ చేయాలి.

కింద తెలిపిన DOB డాక్యుమెంట్ లలో ఏ ఒక్కటి అప్లోడ్ చేస్తే సరిపోతుంది.

  • DateBirth Certificate issued by Competent Local Body/Municipal Authority/Registrar of Births & Deaths
  • Aadhaar Card
  • Pan Card
  • Driving License
  • Certificates of Class X or Class XII issued by CBSE/ICSE/ State Education Boards, if it contains Date of Birth
  • Indian Passport

డాక్యుమెంట్ పై అభ్యర్థి తప్పనిసరిగా Self Attested చేయాలి అనగా జెరాక్స్ కాపీ పై సంతకం / నిషాని పెట్టాలి.తరువాత Next పై క్లిక్ చేయాలి.

Step 17 :Present Address Details లొ

ప్రస్తుతం అభ్యర్థి ఉన్నటువంటి

  • డోరు నెంబరు
  • వీధి పేరు
  • గ్రామం పేరు
  • పోస్టు ఆఫీసు
  • పిన్ కోడ్
  • మండలము లేదా బ్లాక్
  • జిల్లా
  • రాష్ట్రము

వివరాలు ఎంటర్ చేసి సర్టిఫికెట్ ను 2MB లోపు JPG/JPEG/PDF ఫార్మాట్ లొ అప్లోడ్ చేయాలి.

కింద తెలిపిన Address డాక్యుమెంట్ లలో ఏ ఒక్కటి అప్లోడ్ చేస్తే సరిపోతుంది.

  • Water/Electricity/Gas connection Bill for that address(atleast 1 year)
  • Aadhaar Card
  • Current passbook of Nationalized/Scheduled Bank/Post Office
  • Indian Passport
  • Revenue Department’s Land Owning records including Kisan Bahi
  • Registered Rent Lease Deed(In case of tenant)
  • Registered Sale Deed(In case of own house)

డాక్యుమెంట్ పై అభ్యర్థి తప్పనిసరిగా Self Attested చేయాలి అనగా జెరాక్స్ కాపీ పై సంతకం / నిషాని పెట్టాలి.తరువాత Next పై క్లిక్ చేయాలి.

Step 18 :Disability Details లొ

దివ్యంగులు (వికలాంగులు) అవ్వక పోతే ఈ సెక్షన్ వదిలేయొచ్చు. అయితే మాత్రమే కింద తెలిపిన వాటిలో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి

  • Locomotive (ఎముక సంబందించిన)
  • Visual (కళ్ళకు సంబందించిన)
  • Deaf & Dumb (చెవుడు & మూగ)
  • Other (ఇతరులు)

Certificate ఉంటే Yes పెట్టి అప్లోడ్ చేయాలి. లేకపోతే NO అని టిక్ చేయాలి. తరువాత Next పై క్లిక్ చేయాలి.

Step 19 :Family member Details లొ

కుటుంబంలో ఎవరికైనా ఓటరు కార్డు ఉంటే మాత్రమే ఈ సెక్షన్ ను టచ్ చేయాలి లేకపోతే అవసరం లేదు. కుటుంబంలో తల్లి తండ్రి సంరక్షకులకు కార్డు ఉంటే ఎంటర్ వారి పేరు, సంబంధం, Voter Card నెంబర్ ఎంటర్ చేసి Next పై క్లిక్ చేయాలి.

Step 20 :Declaration లొ

  • గ్రామం / టౌన్ 
  • రాష్ట్రము / UT
  • జిల్లా

ను ఎంటర్ చేసి, ప్రస్తుత నివాసంలో ఎన్ని సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు సంవత్సరము మరియు నెలను ఎంటర్ చేయాలి. తరువాత ప్రస్తుతము దరఖాస్తు చేస్తున్న ప్లేసును ఎంటర్ చేసి దరఖాస్తు తేదీని ఎంటర్ చేయాలి తరువాత Next పై క్లిక్ చేయాలి.

Step 21 :Captcha లొ

చూపిస్తున్న Captcha కోడ్ ఎంటర్ చేయాలి.

Step 22 :తరువాత Save పై క్లిక్ చేయాలి.

Step 23 :Preview and Submit పై క్లిక్ చేయాలి.అన్ని వివరాలు సరి చూసుకోవాలి. తప్పుగా ఉంటే Keep Editing ఆప్షన్ ద్వారా సరి చేసుకోవాలి. అన్ని సరిగా ఉంటే Submit పై క్లిక్ చేయాలి.

Step 24 :Are you sure you want to submit this form? అని వస్తుంది. Yes పై క్లిక్ చేయాలి. 

Step 25 :అప్లికేషన్ సబ్మిట్ అవుతూ Acknowledgment Number వస్తుంది. ఆ నెంబర్ నోట్ చేసుకోవాలి. Download Acknowledgment ద్వారా రసీదు డౌన్లోడ్ అవుతుంది.ప్రింట్ తీసుకొని జాగ్రత్త ఉంచుకోవాలి. BLO వారి ఆమోదం అయ్యాక మీకు ఓటు కార్డు నెంబర్ వస్తుంది. మరియు పోస్ట్ ద్వారా కొత్త కార్డు మీరు ఇచ్చిన చిరునామా కు వస్తుంది.లేదా మీ BLO వారి వద్దకు వస్తుంది. 

How to know New Vote Card Application Status ?

Step 1 :పై న చెప్పిన వెబ్ సైట్ లొ లాగిన్ అయ్యాక హోమ్ పేజీ లొ Track Application Status అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 2 :Reference Number లొ Acknowledgment Number ను ఎంటర్ చేసి, రాష్ట్రము సెలెక్ట్ చేసుకోని Submit పై క్లిక్ చేయాలి.

Step 3 :Current Status దగ్గర ప్రస్తుత స్టేటస్ ను తెలుసుకోవచ్చు. 

apply for marriage certificate in Andhra pradesh

How to Apply Voter Id Card Online Through Voter Helpline App

Step 1 : గూగుల్ ప్లే స్టోర్ లో Voter Helpline అనే అప్ ను ఇన్స్టాల్ చేసుకోండి 

Step 2 : మీకు Account ముందు గానే ఉంటె క్రింద లెఫ్ట్ సైడ్ లో explore అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ విండో ఓపెన్ అవుతుంది, పైన login అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని ద్వారా లాగిన్ అవ్వండి.

Step 3 : ఒక వేళా మీకు Account లేనట్లైతే Login విండో లో new user అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మొబైల్ నెంబర్ మరియు OTP ఎంటర్ చేసి ఎకౌంటు క్రియేట్ చేసుకోండి

Step 4 : Account Create అయ్యాక మళ్ళి Login విండో లోకి వచ్చి మొబైల్ నెంబర్ మరియు OTP ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.

Step 5 : క్రింద లెఫ్ట్ సైడ్ లో explore అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ విండో ఓపెన్ అవుతుంది అందులో New Voter Registration (Form 6 ) అని ఉంటుంది దాని మీద క్లిక్ చెయ్యండి 

Step 6 : ఫారం లో ఈ క్రింది వివరాల తో పాటు డాకుమెంట్స్ స్కాన్నేడ్ కాపీ లు ఫారం లో అడిగిన చోట అప్లోడ్ చెయ్యాలి.

  • మీ స్టేట్ ,జిల్లా ,అసెంబ్లీ ,పార్లిమెంట్ 
  • మీ పర్సనల్ డీటెయిల్స్ 
  • మీ రిలేటివ్ డీటెయిల్స్ 
  • కాంటాక్ట్ డీటెయిల్స్
  • ఆధార్ డీటెయిల్స్ 
  • జెండర్ 
  • డేట్ అఫ్ బర్త్ డీటెయిల్స్
  • ప్రెసెంట్ అడ్రస్ డీటెయిల్స్
  • వికలాంగ వివరాలు
  • కుటుంబ సభ్యుల వివరాలు 
  • డిక్లరేషన్ 
  • captcha 

Step 7 : Submit చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ కి రిజిస్ట్రేషన్ నెంబర్ SMS రూపం లో వస్తుంది దానిని సేవ్ చేసుకోవాలి ఆ నెంబర్ ద్వారా మీ అప్లికేషను స్టేటస్ ను ట్రాక్ చేయవచ్చు

Voter Id Card Benefits

  • Voter కార్డు ఉంటె మీరు ఓటు వెయ్యవచ్చు
  • గుర్తింపు కార్డు గా కూడా ఉపయోగ పడుతుంది
  • వయస్సు ధృవీకరణ కు కూడా ఉపయోగ పడుతుంది.
  • మీరు మీ గుర్తింపును నిరూపించడానికి ఇతర సందర్భాల్లో ఉపయోగించవచ్చు.

Voter Id Card Application Fee

ఓటరు ఐడి కార్డు కోసం దరఖాస్తు చేసేటప్పుడు మీరు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
మీ మొబైల్ తో గాని లేదా లాప్టాప్ తో గాని దరఖాస్తు చేసుకోండి ఎటువంటి ఛార్జ్ పడదు 
అయితే, మీరు ఓటరు ఐడి కార్డుని మళ్లీ పొందాలనుకుంటే, మీరు రూ.25 చెల్లించాల్సి ఉంటుంది.

Voter Id Card Download

ఓటర్ ఐడి కార్డ్(How to Download  Voter Id Card Online) డౌన్లోడ్

  • ఓటర్ ఐడి కార్డు డౌన్లోడ్  చేసు కోవాలి అంటే అధికారిక వెబ్ సైట్ కి వెళ్ళాలి.
How to Apply Voter Id Card Online in Telugu website
  • తర్వాత మీ మొబైల్ నెంబర్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి  లాగిన్ అవ్వాలి .
  • డాష్ బోర్డు మీద E-EPIC Download  అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేశాక విండో ఓపెన్ అవుతుంది .
How to Apply Voter Id Card Online in Telugu voter id download
  • మీకు ఇవ్వబడిన రిఫరెన్స్ నెంబర్ లేదా EPIC  no. ఎంటర్ చేసి సబ్మిట్ చెయ్యాలి 
How to Apply Voter Id Card Online in Telugu voter id download page
  • తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి OTP వస్తుంది 
  • OTP ఎంటర్ చేసిన తర్వాత మీ వోటర్ ఐడి కార్డు కనిపిస్తుంది.

Voter Id Card Download Through Voter Helpline App

  • ముందుగా Voter Helpline అప్ ఓపెన్ చెయ్యాలి 
  • Login విండో లోకి వచ్చి మొబైల్ నెంబర్ మరియు OTP ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి 
  • క్రింద లెఫ్ట్ సైడ్ లో explore అనే ఆప్షన్ మీద e – EPIC అని ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చెయ్యండి 
Voter Id Card  Download Through Voter Helpline App step 1
  • ఓటర్ ఐడి డౌన్లోడ్ విండో ఓపెన్ అవుతుంది 
  • మీకు ఇవ్వబడిన రిఫరెన్స్ నెంబర్ లేదా EPIC  no. ఎంటర్ చేసి సబ్మిట్ చెయ్యాలి 
Voter Id Card  Download Through Voter Helpline App step 3
  • తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి OTP వస్తుంది 
  • OTP ఎంటర్ చేసిన తర్వాత మీ వోటర్ ఐడి కార్డు కనిపిస్తుంది.

గమనిక : ఒకవేళ మీ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండకపోతే వోటర్ ఐడి కార్డు డౌన్లోడ్ చేసుకోవడం సాధ్యపడదు మళ్ళి మీరు మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడానికి  form 8 సబ్మిట్ చేయవలసి ఉంటుంది 

Voter Id Card Help Line Number

ఓటర్ హెల్ప్ లైన్ నంబర్ తెలుగులో 1950. ఈ నంబర్‌కు మీరు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు మరియు ఓటర్ కార్డుకు సంబంధించిన ఏదైనా సమస్య గురించి తెలుసుకోవచ్చు లేదా ఫిర్యాదు చేయవచ్చు.

ఓటర్ హెల్ప్ లైన్ నంబర్ 24×7 అందుబాటులో ఉంటుంది మరియు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మరియు 18 ఇతర భాషలలో సేవలు అందిస్తుంది.

1 thought on “how to apply new voter id card online 2024”

Leave a Comment