marriage certificate వివాహ ధృవీకరణ పత్రం పొందే విధానం

రిజిస్ట్రషన్ ఆఫీసులో వివాహ ధృవీకరణ పత్రం పొందే విధానం

NOTE : పట్టణ ప్రాంతాల్లో వివాహం జరిగి 90 రోజులు దాటిన వారు మరియు గ్రామీణ ప్రాంతాల్లో marriage జరిగి 60 రోజుల దాటిన వారు దిగువన పేర్కొన్న విధంగా వివాహ ధృవీకరణ పత్రం కొరకు దరఖాస్తు చేసుకోవాలి.. గడువు దాటని వారు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు

పై WEBSITE OPEN చేసి “HINDU MARRIAGE REGISTRATION” అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత “NEW REGISTRATION” అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి వివరాలు ఇచ్చి రిజిస్టర్ అవ్వాలి.

తర్వాత మెయిల్ ఐడి తో లాగిన్ అవ్వాలి, లాగిన్ అయిన తరువాత కుడివైపు పై భాగంలో *APPLY FOR NEW REGISTRATION* అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి వివరాలు అన్ని ఎంటర్ చేసి సంబధిత ద్రువపత్రలు అన్ని అప్లోడ్ చేయాలి మరియు అన్ని వివరాలు కరెక్ట్ గా ఇవ్వాలి.

అప్లోడ్ చెయ్యాల్సిన ధ్రువపత్రాలు

  1. వెడ్డింగ్ కార్డ్ ఫోటో
  2. 10th మార్క్స్ లిస్ట్/బర్త్ సర్టిఫికెట్/పాస్ పోర్ట్/నోటరీ అపిడివిట్(భర్త)
  3. 10th మార్క్స్ లిస్ట్/బర్త్ సర్టిఫికెట్/పాస్ పోర్ట్/నోటరీ అపిడివిట్(భార్య)
  4. marriage ఫోటో ( ఈ ఫోటో నే marriage సర్టిఫికెట్ మీద ప్రింట్ అయ్యి వస్తుంది,మొత్తం 3 పెళ్ళి ఫోటోలు తీసుకుని వెళ్ళాలి వాటిలో ఒకటి అప్లోడ్ చెయ్యాలి)
  5. రెసిడెన్స్ ప్రూఫ్(భర్త)
  6. రెసిడెన్స్ ప్రూఫ్(భార్య)

వీటితో పాటుగా మ్యారేజ్ ఫంక్షన్ హాల్ రిసిప్ట్ ఉంటే అప్లోడ్ చెయ్యొచ్చు లేకపోతే లేదు. UPLOAD చేసే అన్ని దృవపత్రలు కూడా JPG FORMAT లో ఉండాలి UPLOAD చేసే FILE 1MB మించకుండా ఉండాలి

ఫీజు

అన్ని ఎంటర్ చేసిన తర్వాత ONLINE లో సంబధిత SRO గారు పేరు మీద చలానా జెనరేట్ చేసి FEE ₹200/- PAY చేయవచ్చు లేదా SRO వారి కార్యాలయంలో 200 చెల్లించాలి.

ఎవరికి ఇవ్వాలి

అప్లోడ్ చేసిన అన్నీ ద్రువపత్రల మీద,ముగ్గురు సాక్షుల ఆధార్ కార్డ్ జిరాక్స్ ల మీద ATTESTATION చేయించాలి శుభలేఖ మీద, ఫోటో మీద ATTESTATION అవసరం లేదు

Note: మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కు మన్యువల్ దరఖాస్తు పూర్తి చేసి,దానితో పాటు ATTESTATION చేయించిన ధ్రువపత్రాలు రిజిస్టర్ వారి కార్యాలయంలో ఇవ్వాలి

ఎక్కడ అప్లై చెయ్యాలి

  • అమ్మాయి అడ్రస్ ఏ SUB REGISTER OFFICE పరిధిలోకి వస్తుందో ఆ SUB REGISTER OFFICE లో లేదా
  • అబ్బాయి అడ్రస్ ఏ SUB REGISTER OFFICE పరిధిలోకి వస్తుందో ఆ SUB REGISTER OFFICE లో లేదా
  • వివాహం జరిగిన వేదిక ఏ SUB REGISTER OFFICE పరిధిలోకి వస్తుందో ఆ SUB REGISTER OFFICE లో మాత్రమే వారు వివాహ ధృవీకరణ పత్రంకు దరఖాస్తు చేయగలరు, పై మూడు చోట్ల మాత్రమే వారికి వివాహ ధృవీకరణ పత్రం మంజూరు చేస్తారు కాబట్టి దరఖాస్తు చేసుకున్నప్పుడు సంబధిత SRO OFFICE ను సరిగ్గా ఎంచుకోవాలి 
వెరిఫికేషన్ కి ఎప్పుడు వెళ్ళాలి

 ఏ రోజు VERIFICATION కు హాజరు అవుతారో ఆ రోజును మరియు సమయాన్ని దరఖాస్తు దారుడు ఎంచుకోవాలి. ఏ రోజు స్లాట్ ఆ రోజు బుక్ చెయ్యడం కి అవ్వదు అడ్వాన్స్ బుకింగ్ తప్ప అదే రోజు కి బుక్ చెయ్యడం కి వీలు పడదు.

ఒకవేళ అదే రోజున వివాహ ధృవీకరణ పత్రం కావాల్సినచో సంబధిత దృవపత్రలు అన్ని తీసుకుని వెళ్లి SUB REGISTER గారిని కలిసి వివాహ ధృవీకరణ పత్రం మంజూరు చేయమని కోరవచ్చు. కానీ ఆ రోజు అక్కడ ఉన్న స్లాట్స్ లభ్యతను బట్టి SUB REGISTER వారు తదుపరి చర్యలు తీసుకోవచ్చు.

కానీ SLOT BOOKING చేసుకుని SUB REGISTER వారిని కలవడం ఉత్తమం.

కింది పత్రాలను రెండు కాపీలలో సమర్పించాలి.
  1. వివాహ కార్డు(2)
  2. ఫంక్షన్ హాల్ నుండి వివాహ లేఖ.
  3. జంట వివాహ ఫోటోలు (వివాహ దుస్తులలో వ్యక్తిగత ఫోటోలు మరియు కంబైన్డ్ ఫోటో)
  4. దంపతుల పాస్‌పోర్ట్ఫో టోలు.
  5. జంట ssc సర్టిఫికెట్లు
  6. జంట ఆధార్ కార్డులు
  7. దంపతులకు 4 సాక్షులు..
    -. వరుడికి రెండు , వధువుకు రెండు.(సాక్షుల ఆధార్ కార్డులు)
సాక్షులు ఎవరు ఉండాలి

వధూవరులు ఇద్దరికీ , తల్లిదండ్రులు లో ఒక వ్యక్తి (తండ్రి / తల్లి) తప్పక ప్రధమ సాక్షిగా వ్యవహరించాలి మరియు ఇతర బంధువు (సోదరుడు సోదరి మామ, అత్త, కజిన్ మొదలైనవారు) లేదా స్నేహితులు రెండవ సాక్షిగా ఉండాలి.

వధువు లేదా వరుడు లో ఎవారికైనా తల్లిదండ్రులు ఇద్దరూ లేకుంటే వధువు లేదా వరుడు తమ సంరక్షకుడి పేరును 10 RS BOND PAPER అఫిడవిట్‌లో పేర్కొనడం ద్వారా అఫిడవిట్ నోటరీ చేసి సమర్పించాలి* మరియు తల్లిదండ్రులు ఇద్దరూ మరణిస్తే తల్లిదండ్రుల మరణ ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీలు కూడా సమర్పించాలి.తల్లిదండ్రుల్లో ఒకరు సజీవంగా ఉంటే సంరక్షక అఫిడవిట్ మరియు మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సిన అవసరం లేదు.

వారి ఇంట్లో వివాహం జరిగితే, వివాహం వారి ఇంటి వద్ద జరిగిందని,4 పొరుగువారి నుండి సంతకాలు మరియు ఆధార్ కార్డు నంబర్లను తీసుకొని 10 RS BOND PAPERపై నోటరీ అఫిడవిట్ సమర్పించాలి.

మ్యారేజ్ సర్టిఫికెట్ ఎప్పుడు వస్తుంది

అన్ని వెరిఫై చేసిన తర్వాత మాత్రమే సబ్మిట్ చెయ్యాలి ఒకసారి సబ్మిట్ చేస్తే ఎడిట్ లేదు SRO గారి లాగిన్ నందు ఎడిట్ ఉన్నా కూడా ఎన్ని తప్పులు సరిచేసారో అవి అన్ని నోట్ అవుతాయి కావున సబ్మిట్ చేసేముందు అన్ని ఒకటికి రెండు సార్లు సరిచూసుకోగలరు

వివరాలు అన్ని వేరిఫై చేసిన తరువాత వివాహ ధృవీకరణ పత్రం జారీ చేస్తారు

Contact Us

Mail: [email protected]

Phone : +91 9121106359

1 thought on “marriage certificate వివాహ ధృవీకరణ పత్రం పొందే విధానం”

Leave a Comment