RTE చట్టం 2009, 2023-24 సంవత్సరానికి సెక్షన్ 12(1)(C) ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్ పాఠశాలల్లో మొదటి తరగతి సీట్లలో 25% పిల్లలకు రిజర్వ్ చేయాలి.
- అనాధ పిల్లలు
- SC,ST,BC మైనారిటీ పిల్లలు
- గ్రామాల్లో సంవత్సర ఆదాయం 1.2 లక్షలు, పట్టణాల్లో 1.44 లక్షలు లోపు ఉన్న OC పిల్లలు
పిల్లల వయసు ఎంత ఉండాలి ?
- IB/ICSC/CBSE సిలబస్‌ని అనుసరించే ప్రైవేట్ పాఠశాలల్లో నమోదు చేయడానికి, 01.04.2023న లేదా అంతకు ముందు పిల్లలకి 5 సంవత్సరాలు నిండి ఉండాలి.
- రాష్ట్ర సిలబస్‌ని అనుసరించే ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశానికి, పిల్లల వయస్సు 01.06.2023 నాటికి 5 సంవత్సరాలు నిండి ఉండాలి.
RTE 2023-24 ముఖ్యమైన తేదీలు :
- పాఠశాలలు రిజిస్ట్రేషన్ తేదీలు : 06.03.2023 నుంచి 19.03.2023
- విద్యార్థుల రిజిస్ట్రేషన్ : 22.03.2023 నుంచి 10.04.2023
- GSWS డేటా ప్రకారం విద్యార్థుల డేటా పరిశీలన : 13.04.2023 నుంచి 17.04.2023
- 1st రౌండ్ లాటరీ రిజల్ట్ : 18.04.2023
- పాఠశాలల్లో పిల్లల జాయినింగ్ Confirmation : 19.04.2023 నుంచి 25.04.2023
- 2nd రౌండ్ లాటరీ రిజల్ట్ : 29.04.2023
- పాఠశాలల్లో పిల్లల జాయినింగ్ Confirmation : 01.05.2023 నుంచి 05.05.2023
RTE 2023-24 రిజిస్ట్రేషన్ ఎలా చెయ్యాలి
దరఖాస్తు నమోదు ప్రక్రియకు విద్యార్థి ఆధార్ నంబర్ అవసరం. విద్యార్థికి ఆధార్ నంబర్ లేకపోతే, వారి తల్లి, తండ్రి లేదా సంరక్షకుల (తల్లిదండ్రులు లేని అనాథ పిల్లల విషయంలో) ఆధార్ నంబర్‌ను ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేయవచ్చు.
STEP 1:
ఇక్కడ క్లిక్ చేసి, “రిజిస్టర్” ఎంచుకోండి. నమోదు చేసుకోవడానికి, రిజిస్ట్రేషన్ సమయంలో విద్యార్థి లేదా తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుడు తప్పనిసరిగా BPL కుటుంబం అయి ఉండాలి, అప్పుడే రిజిస్ట్రేషన్ సాధ్యమవుతుంది.
STEP 2:
మీరు నమోదు చేసుకున్న తర్వాత, మీ మొబైల్ నెంబర్ కు User Name & Password లు వస్తాయి.Change Password చేసుకోవాలి.
STEP 3:
లాగిన్ అయిన తరువాత విద్యార్థి లేదా తల్లి తండ్రి లేదా సంరక్షకుల ఆధార్ నెంబరు ఎంటర్ చేసి GO పై క్లిక్ చేస్తే GSWS Server లొ ఉండే డేటా అనగా పేరు , జిల్లా పేరు ,మండలం పేరు,పంచాయతీ పేరు, మొబైల్ నెంబరు,చిరునామా వస్తాయి. మొబైల్ నెంబర్ ను ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ సమయంలో ఏ నెంబర్ అయితే ఇస్తారో ఆ నెంబర్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది.
STEP 4:
ఇతర వివరాలు అనగా PIN Code, E-Mail, DOB, Age, Gender, Religion, Caste, Rice Card Number ( Weaker Section వాళ్లకు తప్పనిసరి) ఎంటర్ చేయాలి.
STEP 5:
విద్యార్థి వయస్సు ఐదు మరియు ఆరు సంవత్సరాల మధ్య ఉండాలి.
- పిల్లల వయస్సు 01.04.2023కి ముందు ఐదేళ్లు దాటితే CBSE, ICSE, IB లేదా రాష్ట్ర పాఠశాలలు అందుబాటులో ఉంటాయి.
- పిల్లల వయస్సు 01.06.2023కి ముందు ఐదేళ్లు దాటితే రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
STEP 6:
విద్యార్థి పాఠశాలకు హాజరయ్యే తోబుట్టువులు ఉన్నట్లయితే, “YES” ఎంచుకుని, వారి పాఠశాల యొక్క UDISE కోడ్ మరియు ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి.
STEP 7:
విద్యార్థికి ఏవైనా ప్రత్యేక అవసరాలు లేదా వైకల్యాలు ఉంటే లేదా HIV/AIDSతో బాధపడుతున్నట్లయితే లేదా అనాథ అయితే, అవసరమైన వివరాలను ఎంటర్ చేయాలి.
STEP 8:
రిజిస్ట్రేషన్ సమయంలో అందించిన చిరునామా తప్పుగా ఉంటే, మీరు ఈ క్రింది రుజువులలో ఒకదాన్ని అప్‌లోడ్ చేయడం ద్వారా దాన్ని అప్‌డేట్ చేయవచ్చు:
ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, కరెంట్ బిల్లు, టెలిఫోన్ బిల్లు, వాటర్ బిల్లు, ఇంటి పన్ను రసీదు, డ్రైవింగ్ లైసెన్స్, ఇంటి అద్దె ఒప్పందం కాపీ, రేషన్ కార్డ్, ఉద్యోగి సర్టిఫికేట్
మీరు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, మీరు SMS ద్వారా అప్లికేషన్ ID మరియు పాస్‌వర్డ్‌ను SMS రూపంలో వస్తుంది. ఆ డేటా Save చేసుకోండి .

Web Options ఎలా ఎంచుకోవాలి:
నమోదు ప్రక్రియ ప్రకారం, విద్యార్థి లేదా తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుల చిరునామా ఆధారంగా క్రింది పాఠశాలలు ప్రదర్శించబడతాయి:
- విద్యార్థి లేదా తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకులు ఉన్నటువంటి చిరునామా నుంచి ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న పాఠశాలలో కనిపిస్తాయి.
- పాఠశాలల సంఖ్య 10 కన్న తక్కువ ఉన్నట్టయితే అప్పుడు మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి పాఠశాలల లిస్టు చూపించడం జరుగును.
- ఒక కిలోమీటర్లు మరియు మూడు కిలోమీటర్ల పరిధిలో ఏ ఒక్క పాఠశాల లేనట్టు అయితే అప్పుడు మిగిలిన పాఠశాలల లిస్టు చూపించడం జరుగును.
- విద్యార్థి యొక్క వయసు ఆధారంగా స్కూల్ ల వివరాలనేవి చూపించడం జరుగును. లిస్టులో నుంచి గరిష్టంగా 10 పాఠశాలను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
1 thought on “ap rte private school free admission 2023-2024”