sachivalayam services on whatsapp వాట్సాప్లో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సూచించే మొబైల్ నెంబరుకు కేవలం ‘HI’ అని మేసెజ్ చేస్తే చాలు.. సచివాలయంలో మీరు పెట్టుకున్న దరఖాస్తు ఏ దశలో ఉందన్న సమాచారం ఇట్టే అందుతుంది
నవరత్నాల పేరిట ప్రభు త్వం అందజేస్తున్న వివిధ పథకాలకు మీరు అర్హు లేనా.. లేదంటే ఏ కారణంతో మీరు అనర్హులుగా పేర్కొంటున్నారన్న సమాచారం కూడా తెలిసిపోతుంది.
ఈ సేవల కోసమే ఒక మొబైల్ నంబరును కేటాయించి ఆ నంబరుకు ఎవరైనా కేవలం మెసేజ్ చేస్తే చాలు.. ఈ సేవలు పొందవచ్చు.
మీ దరఖాస్తు ఎవరి వద్ద ఉందొ కూడా తెలుసుకోండి
ఉదాహరణకు ఎవరైనా ఆదాయ, కుల ధ్రువీకర ణ పత్రాల జారీ తదితర సేవల కోసం గ్రామ, వార్డు సచివాలయాలలో దరఖాస్తు చేసుకుంటే..
సంబంధిత అధికారులు ఆమోదం అనంతరం ఆ సమాచారం వాట్సాప్ ద్వారా దరఖాస్తుదారుడి మొబైల్ నెంబరుకు ఇవ్వడంతోపాటు ఆయా ధ్రు వీకరణ పత్రాలను కూడా మొబైల్లో డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కూడా కలదు.