GPS guaranteed pension scheme Andhra Pradesh 2023

GPS అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పెన్షన్ పథకం ముందుగా మనం OPS , CPS గురించి తెలుసుకుందాం 

Old Pension Scheme (OPS)

  • OPS అనేది defined benefit scheme, అంటే ఉద్యోగికి పదవీ విరమణ తర్వాత ఎంత పెన్షన్ అందుతుందో ఒక నమ్మకం ఉంటుంది.
  • ఇది 2004లో NPS ద్వారా భర్తీ చేయబడిన ఒక నిర్దిష్ట ప్రయోజన పెన్షన్ పథకం(defined benefit scheme).
  • OPS కింద, ప్రభుత్వ ఉద్యోగులు వారి చివరిగా తీసుకున్న జీతంలో (బేసిక్ పే లో ) 50%కి సమానమైన పెన్షన్‌ వస్తుంది.

Contributory Pension Scheme (CPS)

  • CPS అనేది defined contribution scheme, అంటే ఉద్యోగి మరియు గవర్నమెంట్  ప్రతి నెలా కొంత మొత్తాన్ని పెన్షన్ ఫండ్‌కి జమ చెయ్యాలి.
  • ఉద్యోగికి పదవీ విరమణ సమయంలో ఎంత పెన్షన్ లభిస్తుందో తెలియదు, ఎందుకంటే ఇది పెన్షన్ ఫండ్ యొక్క పెట్టుబడి రాబడిపై ఆధారపడి ఉంటుంది.

Guaranteed Pension Scheme (GPS)

GPS అనేది OPS మరియు CPS రెండింటి లక్షణాలను కలిపి చేసిన హైబ్రిడ్ పెన్షన్ పథకం.

ఉద్యోగి ప్రతి నెలా కొంత మొత్తాన్ని పెన్షన్ ఫండ్‌కు అందజేస్తారు మరియు పదవీ విరమణపై ప్రభుత్వం కనీస పెన్షన్ మొత్తాన్ని హామీ ఇస్తుంది.

జీపీఎస్‌ ద్వారా ఆఖరు నెలజీతంలో 50శాతం పెన్షన్, ప్రతి ఆరునెలలకొకసారి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న డీఏ మరియూ డీఆర్‌ల మాదిరగానే జీపీఎస్‌ పెన్షనర్లకు కూడా డీఆర్‌ వర్తింపు.

OPS , CPS , GPS మధ్య తేడా ఏంటి ?

OPS, CPS మరియు GPS మధ్య ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే,

OPS ఒక defined benefit scheme, CPS మరియు GPSలు defined contribution schemes

ఎందుకు ప్రభుత్వం GPS వైపు అడుగులు వేస్తుంది
  • GPS అయితే… పెన్షన్‌కు పూర్తి గ్యారెంటీ ఉంటుంది.
  • CPS లానే ఉద్యోగి 10శాతం ఇస్తే, దానికి సమానంగా ప్రభుత్వం ఇస్తుంది.
  • రిటైర్‌ అయ్యేముందు చివరి శాలరీలో బేసిక్‌లో 50శాతం పెన్షన్‌గా అందుతుంది.
  • CPSతో పోలిస్తే GPS  అందే పెన్షన్‌ 150 శాతం ఎక్కువ.
Join-us-our-telegram-channel

Leave a Comment