ysr pasu bima pathakam Latest 2023

ysr pasu bima pathakam :

మీరు చిన్న మరియు సన్న కారు రైతులా పశుపోషణ పై ఆధారపడి జీవనం సాగిస్తున్నారా…. ముఖ్యంగా పాడి పశువులు, గొర్రెలు మరియు మేకల పెంపకం ద్వారా జీవనోపాధి పొందుతున్నారా….

అయ్యితే అటువంటి పశువులు, గొర్రెలు మరియు మేకలు ప్రమాదవశాత్తు మరణిస్తే, పశుపోషకులు ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వై.యస్.ఆర్ పశు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది

వై.యస్.ఆర్ పశు బీమా పథకం ఎప్పుడు వస్తుంది?

వరదలు, తుఫానులు, పిడుగు పడి పశువు చనిపోయినప్పుడు , పాముకాటు, అడవి జంతువుల దాడి జరిగినప్పుడు మరియు  రోడ్డు, రైలు ప్రమాదము, పశువులు జబ్బు చేసి చనిపోయినా బీమా వస్తుంది.

వై.యస్.ఆర్ పశు బీమా పథకం దేనికి రాదు ?

  • పశువు యజమాని ఉద్దేశపూర్వకంగా పశువుకు హాని తలపెట్టినచో పశు బీమా వర్తించదు.(దీనినే దూల అంటారు)
  • రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి / జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి పరిధిలోకి వచ్చు ప్రమాదాలలో పశు బీమా వర్తించదు. 
  • ఇంతకు మునుపే ఇతర ఏజెన్సీల ద్వారా లేదా ఇతర పథకాల ద్వారా పశువుకు బీమా చేయించినట్లయితే ఈ పశు బీమా వర్తించదు. (డబ్బులు కోసం అక్కడ అప్లై చేసుకోవడమే)

వై.యస్.ఆర్ పశు బీమా పథకం వర్తించే పశువులు / జీవాలు /వివరములు:

  • ఉత్పాదక దశలో ఉన్న ఒకసారి ఈనిన 2-10 సంవత్సరాల ఆవులు, 3-12 సంవత్సరాల గేదెలకు వర్తిస్తుంది.
  •  ఒకటిన్నర సం||లు పై బడిన మేలుజాతి (సంకరజాతి / దేశీయ) ఎద్దులు, దున్నలకు మరియు 2 సం॥లు పై బడిన నాటు ఎద్దులు, దున్నలకు వర్తిస్తుంది.
  •  6 నెలలు మరియు ఆపై వయస్సు గల గొర్రెలు, మేకలు మరియు పందులకు వర్తిస్తుంది పశువు వయస్సు సంబంధిత పశువైద్యాధికారిచే దంత అమరిక ద్వారా నిర్ధారించబడుతుంది.

వై.యస్.ఆర్ పశు బీమా పథకం వర్తించని పశువులు / జీవాలు వివరములు :

  1. 10 సం॥లు వయస్సు పైబడిన ఎద్దులకు మరియు దున్నలకు, 6 నెలల వయస్సు లోపు గొర్రెలు, మేకలు మరియు పందులకు వర్తించదు.
  2. శాశ్వత అంగవైకల్యానికి గురైన పశువులు, గొర్రెలు, మేకలు మరియు పందులకు వర్తించదు

ఎన్ని పశువుల వరకు పశు బీమా వస్తుంది ?

  • ఒక కుటుంబానికి 5 పశువులకు వరకు పశు బీమా వర్తిస్తుంది.
  • గొర్రెలు, మేకలు మరియు పందులకు ఒక కుటుంబానికి 1 సం॥నకు 50 జీవాల వరకు పశు బీమా వర్తిస్తుంది.

ysr pasu bima pathakam

ysr pasu bima pathakam
పశుపోషకులు తప్పనిసరిగా పాటించేవలసిన నిబంధనలు
  • పశువులకు బీమా చేయించునపుడు బ్యాంక్ పాస్ పుస్తకం మరియు ఆధార్ కార్డు ఉండాలి.
  • బియ్యం కార్డు, ఎస్సీ / ఎస్టీ లబ్ధిదారులు కుల ధృవీకరణ పత్రము తీసుకువెళ్ళవలెను.
  • పశుపు మరణించిన వెంటనే దగ్గరలోని రైతు భరోసా కేంద్రము నందు పశువైద్య సహాయకునకు లేదా పశువైద్యాధికారికి లేదా 1962 కు కాల్ చేసి తెలియపరచవలెను.
  • పశువుకు ఖచ్చితంగా చెవిపోగును వేయించాలి. “చెవిపోగు లేనిచో బీమా రాదు” అనే విషయన్ని మర్చిపోవద్దు.
  • ప్రమాదవశాత్తు రోడ్డు / రైలు / అగ్ని మొదలగు ప్రమాదాలలో  పశువులు మరణించినప్పుడు ఎఫ్.ఐ.ఆర్(FIR) ఖచ్చితముగా తెలియపరచి కొత్త చెవిపోగు వేయించుకొని నమోదు చేయించుకొనవలెను.
  • ఒక వేళ చెవిపోగు పడిపోయినచో వెంటనే దగ్గరలోని రైతు భరోసా కేంద్రమునందు గాని లేదా పశువైద్యశాల నందు గాని తీసుకొనవలెను.
  • భీమా చేయించిన పశువును అమ్మిన యెడల వెంటనే 7 రోజులు లోపే బీమా కంపెనీ వారికి తెలియపరచి బీమా పాలసీని కొనుగోలుదారుని పేరు పై మార్చవలను.

ysr pasu bima pathakam helpline Number

వై.యస్.ఆర్ పశు బీమా పథకం గూర్చి ఇతర వివరాలు కోసం కాల్ చెయ్యండి  టోల్ ఫ్రీ నెంబర్ 1962

Leave a Comment