Gsws employees transfers 2023 latest news

రాష్ట్రంలో gsws employees transfers కు  సంబంధించి జూన్ 3వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు

How to apply Gsws employees transfers

సచివాలయాల ఉద్యోగులు ప్రస్తుతం రోజు వారీ హాజరును నమోదు చేసే HRMS PORTAL లో  బదిలీల దరఖాస్తుల నమోదుకు ప్రత్యేక లింకును అందుబాటులో ఉంచారు.

ఆన్లైన్లో బదిలీల దరఖాస్తు నమోదు సమయం లో వారి దరఖాస్తుకు అవసరమైన ధృవీకరణ పత్రాలపై self attested చేసి, వాటిని అప్లోడ్ చేయాల్సి  ఉంటుంది.

బదిలీల ప్రక్రియ షెడ్యూల్ (జిల్లా పరిధిలో) ఇలా..

  • జిల్లాల్లో సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఖాళీల వివరాల నమోదు తేది: మే 28
  • ఆన్లైన్ లో దరఖాస్తుల సమర్పణకు ఆఖరు తేదీ : జూన్ 3
  • ఆన్లైన్లో అందిన దరఖాస్తుల పరిశీలనకు చివరితేదీ : జూన్ 6
  • వెబ్ ర్యాంకు లిస్టుతో పాటు బదిలీలో ఉద్యోగికి కేటాయించిన మండలం లేదా పట్టణం వివరాలు తెలిపే తేది : జూన్ 6
  • తిరస్కరించిన దరఖాస్తులు, తిరస్కరణ కారణంతో కూడిన జాబితా వెల్లడి : జూన్ 6
  • బదిలీ అయిన ఉద్యోగులకు కేటాయించిన మండలం లేదా పట్టణంలో వ్యక్తిగత కౌన్సెలింగ్ తేదీలు : జూన్ 8, 9, 10
  • బదిలీలో కొత్తగా కేటాయించిన సచివాలయ వివరాలతో బదిలీ సర్టిఫికెట్ల జారీ తేది : జూన్ 8, 9, 10
  • బదిలీలకు సంబంధించి కలెక్టర్లకు అభ్యంతరాలు తెలిపేందుకు చివరి తేదీ: జూన్ 10

వేరే జిల్లాకు బదిలీ కోరుకునే వారి కోసం..

  • జిల్లాల్లో సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఖాళీల వివరాలు నమోదు తేది : మే 28
  • ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు ఆఖరు తేది : జూన్ 3
  • వేరే జిల్లాకు బదిలీకి వీలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసే తేది : జూన్ 8 (ఆ ఉత్తర్వులోనే బదిలీ చేసే మండలం లేదా పట్టణం వివరాలు ఉండాలి)
  • బదిలీ అయ్యాక ఉద్యోగులకు వ్యక్తిగత కౌన్సెలింగ్ తేదీ: జూన్ 8, 9, 10
  • కొత్తగా కేటాయించిన సచివాలయం వివరాలతో బదిలీ సర్టిఫికెట్లు జారీ తేదీ: జూన్ 8, 9, 10
  • బదిలీలకు సంబంధించి కలెక్టర్లకు అభ్యంతరాలు తెలిపేందుకు చివర తేది : జూన్ 10
Join-us-our-telegram-channel

Leave a Comment