what is sadabainama(సాదాబైనామా) and 13b online

సాదాబైనామా అంటే ఏమిటి ?

సాదాబైనామా అంటే తెల్ల కాగితంపై భూమి కొనుగోలు లేదా రిజిస్టర్ కాని క్రయ విక్రయాలను సాదాబైనామా అంటారు. రిజిస్ట్రేషన్ కానీ ఏ భూ లావాదేవీ కూడా కేవలం తెల్ల కాగితాల ద్వారా భూమి కొనుగోలు జరిగితే అది సాదాబైనామా(Sadabainama) కొనుగోలే అవుతుంది.

రిజిస్ట్రేషన్ కాని కొనుగోలుపై ఏదైనా పట్టా పొందాలంటే వాటిని రెగ్యులరైజేషన్ చేయించుకోవడం, లేదా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం చేస్తేనే పట్టా వస్తుంది.

బాండు పేపర్ మీద లేదా స్టాంపు పేపర్ మీద భూమి కొనుగోలు చేసిన లేదా వాటిని నోటరీ చేయించుకున్నా సరే అన్ రిజిస్టర్డ్(రిజిస్ట్రేషన్ కాని) కొనుగోలు కిందికే వస్తుంది.

సాదాబైనామా ప్రక్రియ ​

  • భూమి కొనుగోలు ( తేదీ లోపు) : 01-11-2021
  • దరఖాస్తు గడువు : 31-12-2023
  • దరఖాస్తు చేసిన 30 రోజుల్లో ప్రక్రియ పూర్తి చెయ్యాలి.

ప్రక్రియ ​

STEP 1 : ఫారం – 10 ( తహసీల్దార్ కు దరఖాస్తు)

  • వెంటనే ఫారం-11,ఫారం-12 జెనరేట్ చెయ్యాలి. మనం ఎన్ని రోజులు ఇస్తే అన్ని రోజుల వరకు విచారణ గడువు (7/15 రోజులు)
  • ఫారం-11 : భూమి అమ్మిన వ్యక్తి 
  • ఫారం-12 : భూమిపై ఆసక్తి గల సంబంధిత వ్యక్తులు.

STEP 2 : RDO కి పంపుట (ఏమయినా సర్వేనంబర్స్ తప్పుగా ఉంటె RDO గారికి పంపాలి 

STEP 3 : తిరస్కరణ – విచారణ చేసి ఏమయినా భూసమస్య ఉంటె తిరస్కరించవచ్చు (like అస్సైన్మెంట్ ,ప్రభుత్వభూములు,DottedLands…)

STEP 4 : ఫారం -13(A) – సబ్ రిజిస్టర్ గారికి స్టాంప్ డ్యూటీ కోసం పంపుట

STEP 5 : SRO రెస్పాన్స్ ( SRO గారు రిజిస్ట్రేషన్ విలువలు పంపిన తరువాత చలానా తీయించాలి

  • చలానా : చిన్న, సన్నకారు రైతు అయ్యితే మినహాయింపు (5 ఎకరాలు మెట్ట ; మాగాణి  2.5 ఎకరాలు )

STEP  6 : ఫారం-13B (దరఖాస్తు దారికి  తెలియచేయుట)

STEP  7 : ఫారం-13C  – SRO కి పంపించాలి. వాళ్ళ రికార్డ్స్ అప్డేట్ కోసం (EC లో పేర్లు రావడానికి)

STEP 8 : మ్యుటేషన్ ( కొనుగోలు దారుని పేరు రెవిన్యూ రికార్డ్స్లో మార్పు చెయ్యాలి. మళ్ళి mutation కోసం దరఖాస్తు పెట్టనవసరం లేదు )

REJECTED REASONS ఇవి ఉండకూడదు

చుట్టుపక్కల రైతులతో విచారణ చేయకుండా తిరస్కరించకూడదు

  • సాగులో ఉన్నటు ఆధారాలు చూపకయినా
  • విచారణకు చుట్టుపక్కల రైతులు రాకపోయినా.
  • చుట్టుపక్కల రైతులు సంతకం చేయకపోయినా.
  • దరఖాస్తుదారుడు  వల్ల విచారణ తేదీ వాయిదా పడిన.
  • విచారణ తేదీ సమయం రోజు దరఖాస్తుదారుడు రాకపోయినా.
సాగును నిర్దారించుటకు మిగతా శాఖల సహకారం తీసుకోవాలి
  1. MANDAL AGRICULTURE OFFICER 
  2. AE IRRIGATION
  3. APM, DRDA
  4. MPDO

MAO –

  1. Crop Booking, CCRC 
  2. insurance
  3. crop subsidy
  4. utilization of fertilizers, seeds, pesticides
  5. రైతు భరోసా 

AE  -water user associations records 

APM  –

  1. రైతు భరోసా
  2. వైస్సార్ సున్నా వడ్డీ
  3. వరి ధాన్యం సేకరణ కేంద్రం లో రైతుల వివరాలు

MPDO –

  1. MGNREGS(మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం)
  2. ఇతర రైతులకి సంబంధించిన పథకాలు – ట్రాక్టర్ పంపిణి , స్పెయర్లు….

సాగును నిర్ధారించడానికి ఆధారాలు లేకపోయినా క్షేత్రస్థాయిలో చుట్టుపక్కల వారితో. విచారించి నిర్ధారించాలి తప్ప దరఖాస్తుని తిరస్కరించకూడదు.

Join-us-our-telegram-channel

Leave a Comment